Current Date: 04 Jul, 2024

Pawan made Mahesh fans angry

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఎవరంటే మొదట సూపర్ స్టార్ కృష్ణ పేరు చెప్తారు. సినీ హీరోగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. కాగా మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బీజేపీతో కలిసి నిర్వహించిన ర్యాలీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..సీనియర్ ఎన్టీఆర్ సినిమా, రాజకీయంగా ఉన్నత పదవుల్ని అనుభవించారు. అయితే రాజకీయంగా అందరు నటులు ఆయనకు మద్దతు ఇవ్వలేదు. పలువురు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. కృష్ణ కాంగ్రెస్‌లో, ఇతర నటులు మరో రాజకీయ పార్టీలో ఉన్నారు. కానీ ఎన్టీఆర్, కృష్ణ రాజకీయంగా ఏనాడూ విమర్శలు చేసుకోలేదని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వైయస్‌ఆర్‌సీపీ వైరల్ చేయగా.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. దాంతో పవన్, మహేష్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.