Current Date: 02 Jul, 2024

Pawan Kalyan is again shooting for the film.. First Oji!

ఏపీలో ఎన్నికల కారణంగా చాలా రోజులు సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకోనున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కొన్ని నెలలపాటు ప్రచారానికే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ముగిసిపోవడంతో పవన్ మళ్లీ షూటింగ్‌ల బాట పట్టనున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమై ఐదేళ్లు గడిచినప్పటికీ ఆ సినిమాను పవన్ ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఓజీ సినిమా చిత్రీకరణ చాలావరకు పూర్తయింది.

ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్‌గా నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాత దానయ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఓజీ మూవీని పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారని సమాచారం.