అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కథ తేల్చే పనికి వేళయింది. కల్తీ నెయ్యి కేసు నిజాలు తేల్చేందుకు సిట్ సిద్ధమైంది. సిట్ ఎంక్వయిరీకి సహకరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమైంది. దేశవ్యాప్త సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు విచారణ వైపు అడుగులు వేస్తోంది. ఎన్ డి డి బి కాఫ్ నివేదిక ఆధారంగా నెయ్యిలో కల్తీ నిజమేనన్న టీటీడీ వాదన, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్న కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎట్టకేలకు సుప్రీం కోర్టు దాకా వెళ్ళిన వ్యవహారంలో కేంద్ర బృందం కల్తీ నెయ్యి కేసును విచారించబోతోంది. ఇక అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ అక్రమాలను నిగ్గుతేల్చేందుకు సిట్ సభ్యులతోపాటు మొత్తం నలుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, ఇద్దరు ఎస్సైల సేవలను వీరు వినియోగించు కోవాలని భావిస్తోంది. మరికొందరు మినిస్టీరియల్ సిబ్బంది అవసరం ఉందని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది.
Share