Current Date: 07 Oct, 2024

మూడు అంచల భద్రత ఐదు నిఘా నేత్రాలు గబ్బాడ ఇసుక పాయింట్ చుట్టు పహరా

నర్సీపట్నం మండలం గబ్బాడ వద్ద గత ప్రభుత్వ హయాంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశారు. రాజమండ్రి వద్ద గోదావరి నది నుంచి ఇసుకను ఇక్కడికి తరలించి, నిల్వచేసి ,ఇక్కడ నుంచి విక్రయాలు చేసేవారు. ఇటీవల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.  నర్సీపట్నం శాసనసభ్యుడుగా గెలిచి, రాష్ట్ర శాసనసభకు స్పీకర్ గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు గబ్బాడ ఇసుక పాయింట్ నుంచి ఇసుక అమ్మకాలు జరపవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఇసుక స్టాక్ పాయింట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు జిల్లా కలెక్టర్ ను, భూగర్భ గనుల శాఖ, రెవెన్యూశాఖ లను ఆదేశించారు. కొండను తలపించే స్థాయిలో ఇక్కడ ఇసుక నిల్వ చేశారు. ప్రస్తుతము ఇక్కడ ఉన్న ఇసుక విలువ సుమారు 10 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇసుకను   అక్రమంగా తరలించుకుపోయే అవకాశం ఉండడంతో ఇక్కడ పహారా ఏర్పాటు చేశారు.

Share