Current Date: 06 Oct, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూ.ఎన్టీఆర్? నందమూరి హీరో క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం పరధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు సహా.. సినీ, రాజకీయ ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం అందింది.గత కొంతకాలంగా నందమూరి, నారా ఫ్యామిలీతో అంటీముట్టనట్లు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రమాణ స్వీకారానికి వస్తారా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. చంద్రబాబు గెలిచిన తరువాత.. అభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కానీ.. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ.. ఎన్నికల సందర్భంలో కానీ.. ఎన్టీఆర్ జోక్యం చేసుకోలేదు.