టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. సరిగ్గా రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టుని ఓడించిన ఇంగ్లాండ్‌పై గురువారం రాత్రి ప్రతీకారం తీర్చుకుంటూ తుది పోరుకి టీమిండియా అర్హత సాధించింది. ఇక కప్ కోసం శనివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్లో భారత్ జట్టు తలపడనుంది.వర్షం కారణంగా ఆలస్యంగా మొదలై, మధ్యలోనూ ఆగి.. సాగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టుని 16.4 ఓవర్లకే కేవలం 103 పరుగులకే భారత్ బౌలర్లు కుప్పకూల్చేశారు.ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డ్ కూడా నమోదైంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో కెప్టెన్‌గా 5 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా తడబడుతున్నాడు. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లో కలిపి 5 పరుగులే చేసిన విరాట్..సెమీస్‌లో 9 బంతుల్లో 9 పరుగులే చేసి ఔటయ్యాడు. కనీసం ఫైనల్లోనైనా కోహ్లీ చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Share