టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోని విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా జట్టులో భాగంగా ఉన్న కెప్టెన్‌ను ఆ జట్టు రిటైన్ చేసుకోకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఢిల్లీకి రిషభ్‌కు మధ్య గ్యాప్ వచ్చిందని, ముఖ్యంగా డబ్బుల విషయంలో విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. మరికొందరేమో పంత్ కావాలనే ఫ్రాంఛైజీ మారాలని భావించాడని చెప్పారు. ఇంకొదరేమో.. కోచ్ పాంటింగ్ సహా మరికొందరు సహాయ సిబ్బందిని మార్చడం పంత్‌కు నచ్చలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. డబ్బు విషయంలోనే పంత్‌కు, ఫ్రాంఛైజీకి మధ్య భేదాభిప్రాయం వచ్చిందని వ్యాఖ్యానించాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. గవాస్కర్ కామెంట్స్‌పై రిషభ్ పంత్ తనదైన శైలిలో స్పందించాడు. నా రిటెన్షన్ అంశం డబ్బుతో ముడిపడి లేదని నేను కచ్చితంగా చెప్పగలను.. తెలిసీ తెలియక మాట్లాడకండి అనే అర్థంలో రిషభ్ పంత్ బదులిచ్చాడు.
Share