కోడికత్తి కేసు శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీం నిరాకరణ
Jul 15, 2024
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యానికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. 2019 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై శ్రీనివాసరావు కోడికత్తితో దాడి చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ.. నిందితుడిని అరెస్ట్ చేసింది. సుమారు ఐదేళ్లు జైల్లో ఉన్న శ్రీనివాసరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ రద్దుకు నిరాకరించింది.