నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పేరు వినని తెలుగు వారుండరు.వానలో తడవని వారు ఎలా ఉండరో అలాగే ఆయన పేరు ప్రఖ్యాతులను తెలియని వారు కూడా ఉండరనేది అక్షర సత్యం.అలాంటి మహానుభావుడైన అక్కినేని నాగేశ్వరరావుకు పొందూరు ఖాదీ వస్త్రాలంటే చెవికోసుకునే వారు.నిత్యం పొందూరు ఖద్దరు పంచెను ధరించేవారు.గత అర్ధ శతాబ్దంగా ఎ.ఎన్.ఆర్ బ్రాండ్ జరీ అంచు పంచెలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది.