Current Date: 26 Nov, 2024

జమిలిపై ‘తెలుగు’ పార్టీల మాటేంటి?

జమిలిపై ‘తెలుగు’ పార్టీల మాటేంటి?  ఒక దేశం.. ఒకే ఎన్నికల పేరుతో దేశ వ్యాప్తంగా ఒకే దఫా ఎన్నికల్ని నిర్వహించే ప్రక్రియను చేపట్టాలని బీజేపీ మొదట్నించి చెబుతోంది. దీని కారణంగా పాలనాపరమైన సమస్యలు తగ్గటం.. డెవలప్ మెంట్ లో దూసుకెళ్లటంతో పాటు.. భారీగా ఖర్చు మిగులుతుందన్నది వాదన. ఈ జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీలు సైతం పెద్ద ఎత్తున సానుకూలను వ్యక్తం చేశాయి. అదే సమయంలో.. కొన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండిపోయాయి. అలా చెప్పకుండా ఉండిపోయిన తెలుగు రాష్ట్రాల్లోని అధికార.విపక్ష పార్టీలు ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ మొత్తం 62 పార్టీల అభిప్రాయాన్ని కోరింది. ఇందులో 47 పార్టీలు మాత్రమే రియాక్టు అయ్యాయి. 15 రాజకీయ పార్టీలు ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. తమ స్టాండ్ ఏమిటన్న విషయాన్ని చెప్పిన 47పార్టీల్లో 32 పార్టీలు అనుకూలంగా ఓటేస్తే పదిహేను పార్టీలు మాత్రం నో చెప్పేశాయి.  

Share