Current Date: 07 Oct, 2024

హీరోయిన్‌తో ప్రేమాయణంపై భారత బౌలర్ క్లారిటీ

టీ20 ప్రపంచ కప్‌ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు.. ప్రస్తుతం విరామంలో ఉన్నారు. చైనామన్ బౌలర్ కుల్దీప్‌ యాదవ్‌కు తన పర్సనల్ గురించి కీలక విషయాలు వెల్లడించాడు. ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ అంటూ.. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు.కుల్దీప్ ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ వార్తలపై కుల్దీప్ స్పందించాడు. ఏ హీరోయిన్‌తోనూ తాను ప్రేమలో లేనంటూ తేల్చి చెప్పేశాడు. అలాగే, తాను వివాహం చేసుకోబోయే అమ్మాయి సినిమా రంగానికి చెందింది కాదంటూ క్లారిటీ ఇచ్చేశాడు.ప్రపంచ కప్‌ గెలవడంపై కుల్దీప్ తన ఆనందం వ్యక్తం చేశాడు. ఇలాంటి అద్భుతమైన సమయం కోసం ఎంతో కాలంగా వేచి చూసినట్లు ప్రకటించాడు. అలాగే, పీఎం నరేంద్ర మోడీని కలవడం నాలో ఎనలేని ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో 10 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. భారత విజయంలో ప్రముఖ పాత్ర పోషించాడు

Share