Current Date: 26 Nov, 2024

కర్రోడా అని తిట్టిన భార్య.. విడాకులిచ్చిన భర్త!

భార్యాభర్తలు అన్నతర్వాత అలకలు, సరదాలు కామనే. కానీ.. ఓ భార్య తన భర్తని కర్రోడా అనడం ఆమె చేసిన పాపమైంది. అది సరదాగా అన్నా.. సదరు భర్త సీరియస్‌గా తీసుకున్నాడు. దాంతో ఇద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.ఇంట్లో భార్య పదే పదే కర్రోడా అని అనడంతో భర్త కోర్టును ఆశ్రయించాడు. అలా ఆమె ప్రతి సారి పిలుస్తుంటే ఇబ్బందిగా ఉందని కోర్టుకు ఆ భర్త విన్నవించాడు. అలానే ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు.హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తను కర్రోడా అని పిలవడం క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ పద్దతిన మెంటల్, ఫిజికల్, ఎమోషనల్‌గా కూడా అతనిపై ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది.భర్తకు మానసిక వేదన కలిగించిన భార్య నుంచి కోర్టు విడాకులు మంజూరు చేసింది.