బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్లు తొలి టెస్టు మ్యాచ్లో తలపడనున్నాయి. రెండో బిడ్డ జన్మించడంతో తొలి టెస్టు మ్యాచ్కు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నారు. అతడు జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. భారత్లోనే ఉండిపోయాడు. అతడు ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు అనే దానిపై కాస్త క్లారిటీ వచ్చింది. తొలి టెస్టు మూడో రోజు అంటే నవంబర్ 24న అతడు భారత జట్టులో కలుస్తాడని సమాచారం. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు. ఇక మ్యాచ్ సన్నద్ధ కోసం నవంబర్ 30, డిసెంబర్ 1న కాన్బెర్రాలోని మనుకా స్టేడియంలో ప్రైమ్ మినిస్టర్స్XIతో రెండు రోజుల పాటు జరగనున్న డే-నైట్ టెస్టు మ్యాచ్ను రోహిత్ ఆడనున్నాడు. అతడు భారత్ ఏ జట్టు తరుపున బరిలోకి దిగనున్నట్లు పేర్కొంది.