Current Date: 26 Nov, 2024

కేటీఆర్‌ అరెస్ట్‌కి రంగం సిద్ధం.. గవర్నర్ పర్మీషన్ కోసం వెయిటింగ్?

మాజీ మంత్రి కేటీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై విచారణకు అనుమతి కోరుతూ తెలంగాణ గవర్నర్‌కు ఏసీబీ లేఖ రాసి 15 రోజులైనా ఇప్పటివరకూ అనుమతి రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విచారణకు నిబంధనల ప్రకారం గవర్నర్‌ అనుమతి కోరుతూ పంపిన దస్త్రం ఆయన వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. విచారణకు అనుమతి నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ కేటీఆర్‌ చక్కర్లు కొడుతున్నారన్నారు. దీని ద్వారా బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి బంధం బయటపడుతోందన్నారు. ఒకవైపు కేసీఆర్‌ అవినీతిపై తాము చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు బీజేపీ సాయపడుతోందని ఆక్షేపించారు. ‘‘గతంలో మహారాష్ట్రకు చెందిన చాలామంది నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. కానీ, అక్కడ ఆ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు? తెలంగాణలో ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని, కాంగ్రెస్‌కు ఓటేయొద్దని చెప్పడం ద్వారా పరోక్షంగా మోడీకి ఓటేయాలని బీఆర్‌‌ఎస్ చెబుతోంది’’ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Share