విశాఖ కలెక్టర్ ఎ.మల్లిఖార్జున తరతరాలుగా వివాదంలో వున్న భూములకు అడ్డదిడ్డంగా అనుమతులు ఇవ్వడం ద్వారా విశాఖ విలన్‌గా పేరుగాంచారు. విశాఖ విలన్‌గా మారిన కలెక్టర్ అంటూ విపక్షాలు అప్పట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నీతికి, నిజాయితీకి మారుపేరైన ఎందరో సీనియర్ ఐఏఎస్ అధికారులు కాపాడిన వేల కోట్ల రూపాయల విలువ చేసే విశాఖ భూములను మూడో కంటికి తెలియకుండా ప్రస్తుత కలెక్టర్ మలికార్జున ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేసి విశాఖకు తీరని ద్రోహం చేశారనే విమర్శలు మిన్నంటుతున్నాయి. ఒక వైసీపీ నాయకుని నేతృత్వంలో విశాఖలో 30 వేల కోట్ల రూపాయల భూదందాలు జరిగాయని పదే పదే తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో 80 శాతం భూలావాదేవీలకు రెవిన్యూ పరంగా అనుమతులు ఇచ్చిందీ, 22ఏ సడలింపు ఇచ్చిందీ మల్లిఖార్జునే కావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన అసైన్డ్ భూముల ప్రీ హోల్డ్ సర్టిఫికేట్ కుంభకోణంలో ఆయన ప్రతిష్ట అధోపాతాళానికి దిగజారింది.