Current Date: 05 Oct, 2024

హీరోయిన్ కంగనాని కొట్టిన కానిస్టేబుల్.. ఎంపీగా గెలిచిన రెండు రోజులకే!

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. ఇటీవల బీజేపీ ఎంపీగా ఎన్నికైన కంగ‌నా ర‌నౌత్‌కి ఘోర అవమానం ఎదురైంది. దురుసు మాటతీరు, ప్రవర్తనతో ఇన్నాళ్లు వార్తల్లో నిలిచిన కంగనా.. తీవ్ర విమర్శల నడుమ  లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. దాంతో అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుని తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో చండీగఢ్ విమానాశ్రయంలో కంగ‌నాపై అక్క‌డే డ్యూటీలో ఉన్న సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చేయి చేసుకుంది.కంగనా ఢిల్లీకి వెళుతున్న క్ర‌మంలో ల‌గేజీ స్కాన్‌లో ఫొన్‌ను ట్రేలో వేయ‌కుండా నిరాక‌రించింద‌ని.. ప్రశ్నించినందుకు అక్క‌డ డ్యూటీలో ఉన్న వారితో వాదిస్తూ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దాంతో అక్కడే ఉన్న సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంప దెబ్బ కొట్టింది. అయితే ఇక్కడ మరో వాదన కూడా తెరపైకి వస్తోంది.