ఉమ్మడి విశాఖ కు డిప్యూటీ కోఆర్డినేటర్ పదవికి పరిమితం
వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన పార్టీ జిల్లాల బాధ్యుల జాబితాలో గుడివాడ అమర్నాథ్ పేరు చేర్చడం తో ఇక పార్టీ టిక్కెట్ లేదని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ సేవలకే గుడివాడ పరిమితం కావలసి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అనకాపల్లి శాసన సభ్యునిగా అట్టర్ ఫ్లాఫ్ అయిన గుడివాడ ఎక్కడ నుంచి పోటీ చేసినా కనీసం 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశం ఉన్నట్టు అంచనాలు వెళ్లడయ్యాయి. అయినా గుడివాడ కన్ను యలమంచిలి, చోడవరం, పెందుర్తి నియోజకవర్గా లపై పడింది. కానీ యలమంచిలి లో ప్రస్తుత ఎమ్మెల్యే కన్నబాబు రాజు ససేమిరా అంగీకరించలేదు. ఇక చోడవరం లో పరువు పూర్తిగా పోగొట్టుకున్న గుడివాడ కన్నా కొంచెం పరపతి పోగొట్టుకున్న ధర్మశ్రీ నే బెటర్ అని పార్టీ నాయకత్వం తేల్చేసింది. ఇక పెందుర్తి ప్రస్తుత ఎమ్మెల్యే కి ఇక్కడి పార్టీ బాధ్యులు వైవీ సుబ్బారెడ్డి ఆశీస్సులు పూర్తిగా వున్నాయి. దీంతో జిల్లాలో ఎక్కడా గుడివాడ కు చోటు లేకుండా పోయింది.మంత్రి పదవితో విర్రవీగి పోయిన గుడివాడ అమర్నాథ్ చివరికి పార్టీ టిక్కెట్ దొరక్క పార్టీ పదవి కే పరిమితం కావలసిన వచ్చింది.