Current Date: 05 Oct, 2024

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్రీయ గీతం జయజయహే తెలంగాణ గేయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూన్‌ 2 ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ప్రజల ముందుకు వచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ గీతాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన పాటను విడుదల చేశారు. ఈ పాటను అందెశ్రీ రచించగా.. కీరవాణి సంగీతం అందించారు. పాట విడుదల సందర్భంగా రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.