Current Date: 06 Jul, 2024

బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాను....

నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో  ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నేటికి వాయుగుండంగా.. ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా  మారనుంది. దీనికి రెమాల్ గా పేరు పెట్టారు. మరింత బలపడి తీవ్ర తుపానుగా మారి ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషాలో భారీ వర్షాలు కురుస్తాయని తీరం దాటేటప్పుడు వంద కి.మీ.పైగా గాలులు వీస్తాయని తెలియజేసింది. అయితే ఆంధ్ర ప్రదేశ్‌కు ముప్పు లేనట్టేనని వాతావరణ నిపుణులు తెలియజేశారు. ఇదే సమయంలో తీరానికి దూరంగా తుపాను పయనించనున్నందున ఆ దిశగా భూ ఉపరితలం మీద నుంచి వేడి గాలులు వీయనున్నాయి. ఇప్పటికే వాయువ్య భారతం నుంచి తీవ్ర వడగాల్పుల మధ్య ఒడిషా ఆంధ్రప్రదేశ్ మీదుగా అల్పపీడనం దిశగా వీస్తున్నాయి. రానున్న 2, 3 రోజుల్లో వాడగాల్పుల తీవ్రత మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.