హర్యానాలో బీజేపీతో విసిగిపోయిన ప్రజలు తిరగబడ్డారు. కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ హాజరయ్యే సభలో బీభత్సం సృష్టించి.. బీజేపీ నేతల్ని అక్కడి నుంచి తరిమికొట్టారు. బీజేపీ ఇస్తున్న అబద్ధపు హామీలు, నీచ రాజకీయాలతో విసిగిపోయి ప్రజలు తిరగబడినట్లు తెలుస్తోంది.
పది లోక్‌సభ స్థానాలున్న హర్యానాలో ఈనెల 25న ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలో ఇటీవల ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్‌సింగ్ సైనీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మైనారిటీలో పడింది. హర్యానా అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 90 కాగా, బిజెపి బలం 39. ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు ఉప సంహరణతో బలం 36కి తగ్గింది. బిజెపి తన బల నిరూపణకు 45 మంది ఎంఎల్‌ఎలు అవసరం. కాగా, ఇప్పటి వరకూ బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మనవడు, జెజెపి అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో.. బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు. చివరికి గవర్నర్‌పై కూడా ఒత్తిడి తీసుకొస్తోంది. దాంతో.. ప్రజలు విసిగెత్తిపోయి ఎదురుదాడి చేస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఇప్పుడు హర్యానాలోనూ పునరావృతం కావడం బీజేపీకి దేశంలో గడ్డుకాలం రాబోతోందని అనడానికి సంకేతంగా చెప్పొచ్చు.