Current Date: 24 Jun, 2026

వైయస్ జగన్‌కు థ్యాంక్స్ చెప్పి.. పవన్‌ను పట్టించుకోని తమిళనాడు సీఎం విజయ్!

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. సౌత్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువ ట్రోల్ అయ్యారు. విజయ్ తరహాలో పవన్ కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటే బాగుండేదని ఆఖరికి జనసేన నేతలు కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం.. పవన్‌కి కూడా కోపం తెప్పించింది. ఆ ఆక్రోశంలో విజయ్ గెలుపుని గాలివాటం అంటూ.. సోషల్ మీడియా ద్వారా గెలిచేశాడంటూ పవన్ కళ్యాణ్ ఎగతాళి చేశారు. తాను 12 ఏళ్లుగా కష్టపడుతున్నా సాధ్యపడటం లేదని.. విజయ్ కేవలం నెలల వ్యవధిలోనే సీఎం అయిపోయాడంటూ పవన్ తన బాధని బహిరంగంగానే వ్యక్తపరిచారు. బహుశా టీవీకే పార్టీ.. పవన్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నట్లుంది. జూన్ 22న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు విష్ చేసిన ప్రతి ఒక్కరికీ విజయ్ ఎక్స్ (X) వేదికగా రీట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైయస్ జగన్, షర్మిల, రోజా, విష్ణువర్ధన్‌రెడ్డిలతో పాటు తెలంగాణ మంత్రులకు కూడా తమిళనాడు సీఎంవో ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది. కానీ, ఒక్క పవన్‌ కళ్యాణ్ తప్ప. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ అధికారిక ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపినప్పటికీ, తమిళనాడు సీఎంవో దానిపై కనీసం స్పందించలేదు. పవన్ కల్యాణ్ తన మొదటి ట్వీట్‌లో 'తమిళనాడు సీఎం' అనే గౌరవ పదాన్ని వాడకుండా 'మిస్టర్ విజయ్' అని సంబోధించడంపై టీవీకే పార్టీకి ఆగ్రహం తెప్పించినట్లుంది. దాంతో పవన్ ఆ పాత పోస్ట్‌ను తొలగించి, మళ్లీ కొత్తగా శుభాకాంక్షలు చెప్పాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నింటినీ తమిళనాడు సీఎంవో నిశితంగా గమనించి.. కనీసం రిప్లై కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేసింది.