Current Date: 27 Sep, 2024

ఇస్లాం దేశాలకి బెగ్గర్స్‌ని ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్!

పాకిస్థాన్ నుంచి  త‌మ దేశాల‌కు వ‌చ్చే బిచ్చ‌గాళ్లు త‌ల‌నొప్పిగా ఉందని ఇస్లామిక్ దేశాలు మండిపడుతున్నాయి. ముస్లిం మ‌త ప‌విత్ర ప్ర‌దేశాల‌ను ద‌ర్శించ‌డానికి అంటూ పాక్ నుంచి వచ్చే వాళ్లు.. తిరిగి తమ దేశానికి వెళ్లడం లేదట. వాళ్లు అక్క‌డే అడుక్కుతింటూ కాలం గ‌డుపుతున్నారని ఆ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి.పాకిస్తాన్ లో లైఫ్ క‌న్నా, ఇలా బెగ్గింగ్ చేసుకుంటూ బ‌త‌క‌డ‌మే వారికి సౌల‌భ్యంగా ఉన్న‌ట్టుంది. ఇది ఎంత వ‌ర‌కూ వెళ్లిందంటే ఈ మ‌ధ్య‌కాలంలో పాకిస్థాన్ దౌత్య వేత్త‌ల‌కు ఇత‌ర ఇస్లామిక్ దేశాల నుంచి ఈ విష‌యంలో హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయ‌ట‌. ఇప్పటికే టెర్ర‌రిస్టుల‌ను ఎగుమ‌తి చేస్తుంద‌నే పేరు పాక్‌కి ఉంది. ఇప్పుడు బెగ్గ‌ర్ల‌ను కూడా అని పాక్‌పై జోక్‌లు పేలుతున్నాయి.హ‌జ్ యాత్ర‌కంటూ ఇక‌పై పాక్ నుంచి వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల విష‌యంలో తాము పున‌రాలోచించుకోవాల్సి వ‌స్తుందంటూ సౌదీ మంత్రి పాకిస్థాను ఇటీవల హెచ్చరించారు. అక్కడ ఉన్న బిచ్చ‌గాళ్లను గుర్తించి, అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా వారిలో 90 శాతం మంది పాకిస్తాన్ వాళ్లేనని తేలింది.

Share