Current Date: 25 Nov, 2024

కీర్తి సురేశ్ పెళ్లి ముహూర్తం కుదిరిందా...

మహానటి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ హీరోయిన్‌ కీర్తి సురేశ్...ఈ చిత్రం తరువాత తెలుగుతో పాటు పలు భాషల్లో హీరోయిన్‌ గా బిజీ అయ్యారు. మహానటి' చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా పొందారు. అయితే కీర్తి సురేశ్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందా? అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. ఆమె త్వరలో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. దుబాయ్‌లో స్థిరపడిన కొచ్చికి చెందిన ఆంటోని తట్టిల్‌తో కీర్తిసురేశ్ ‌కు పదిహేను సంవత్సరాల స్నేహబంధం ఉంది. త్వరలో వీరి స్నేహబంధం పెళ్లితో భార్యాభర్తల అనుబంధంగా మారనుంది. ఇందుకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించారట. డిసెంబర్‌ 11 న వీరి వివాహం గోవాలో జరుగనుంది. 

Share