టాలీవుడ్లో కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్గా ఉన్న శ్రియ.. గత కొంతకాలంగా సినిమాలు చేయడం లేదు. అడపాదడపా వెబ్ సిరీస్‌ల్లో కనిపిస్తోంది. సినిమాల నుంచి గ్యాప్ రావడంతో.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫ్యామిలీతో సమయం గడుపుతోంది. తాజాగా తన కుమార్తె రాధతో కలిసి పొలం పనులు చేస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. పంట నూర్పిళ్ల విధానాన్ని తన కూతురుకి శ్రియ నేర్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెల్ఫోన్లతో పిల్లలు బిజీగా ఉంటున్న ఈ కాలంలో శ్రియ ఇలా చేయడం అభినందనీయమని పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. శ్రియ సినిమాల విషయానికి వస్తే.. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్య 44’లో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ లేదా ఏదైనా సైడ్ క్యారెక్టర్ అనేది తెలియాల్సి ఉంది.