Current Date: 02 Oct, 2024

దయనీయ స్థితిలో ఫిష్ వెంకట్ దాతల కోసం ఎదురుచూపులు

తెలుగు సినిమాల్లో విలన్ పక్కన అమాయకంగా కామెడీ చేసే అతి కొద్ది మంది నటుల్లో ఫిష్ వెంకట్ ఒకరు. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేశారు. ఎన్టీఆర్ 'ఆది' మూవీలో తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో తెగ పాపులర్ అయ్యారు. టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ చేసిన ఈ నటుడు.. ఇప్పుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. దాతలు ఎవరైనా సరే సాయం చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ఎదురుచూస్తున్నాడు.రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తోందని, ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేసుకుంటున్నానని చెప్పాడు. 'ఓ రోజు ఆయాసం బాగా వచ్చేసరికి ఆస్పత్రికి వెళ్లాను. వారం రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత డయాలసిస్ అవసరమని డాక్టర్లు చెప్పారు. అదేంటో మాకు తెలీదు. దాంతో నిమ్స్‌‌లో జాయిన్ అయ్యాను. అక్కడే ఏడాదిన్నరగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కాలికి చిన్న దెబ్బ తగిలింది. మరోవైపు బీపీ, షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఆపరేషన్ చేశారు. ఇదంతా నాలుగేళ్ల క్రితం మాట''అప్పటి నుంచి నా పరిస్థితి పూర్తిగా ఇలా అయిపోయింది. రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. 

Share