Current Date: 30 Jun, 2024

ఐఏఎస్ ..వీఆర్ఎస్ !!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ కేఎస్ శ్రీనివాసరాజు వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) తీసుకున్నారు. శ్రీనివాస్ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2001 ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసరాజు 2011లో విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో టీటీడీ జేఈవోగా నియమితులయ్యారు. ఆ తర్వాత నుంచి జేఈవోగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్‌ వరకు ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు టీటీడీ జేఈవో బాధ్యతల్లో కొనసాగారు. శ్రీనివాసరాజు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో జేఈవోగా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన టీటీడీలో తనదైన ముద్ర వేశారు.. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంటర్‌ కేడర్‌పై తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. ఈ ఏడాది మార్చి నెలతో డిప్యుటేషన్‌ గడువు ముగియడంతో పొడిగింపు కోసం క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే డిప్యుటేషన్ పొడిగింపునకు అనుమతి రాకపోవడంతో తిరిగి ఏపీకి వచ్చేశారు.

Share