Current Date: 04 Jul, 2024

ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా మానేయండి లేకపోతే జైలే

ఐఆర్సీటీసీ ఐడీ ఎవరికి పడితే వారికి షేర్ చేయడం లేదా ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేయడం ఇకపై మానేయండి. లేకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అదేంటనుకుంటున్నారా..అవును నిజమే మరి..రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. ఐఆర్సీటీసీ నిబంధనలు మార్చింది. ఇకపై మీ ఫ్రెండ్స కోసమో లేదా తెలిసినవాళ్లకో మీ ఐడీతో టికెట్ బుక్ చేయవద్దు. మీ ఐఆర్సీటీసీ ఐడీ కూడా ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఇవ్వద్దు. లేకపోతే ప్రమాదం కొనితెచ్చుకుంటారు.రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ టికెట్ బుకింగ్ చేయడానికి వీలుంది. ఏజెంట్లు కానివాల్లు ఇతరులకు టికెట్ బుక్ చేయకూడదు. ఇతరులు ఎవరైనా సొంతానికి టికెట్ బుక్ చేసుకోవాలంటే వ్యక్తిగతంగా ఎవరికివారు ఐఆర్సీటీసీ ఐడీ కలిగి ఉండాలి. ఇది మీ మెయిల్ ఐడీ ఆధారంగా చాలా సులభంగా రిజిస్టర్ అయి తీసుకోవచ్చు.

 

 

Share