ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్‌కి గత కొన్ని రోజులుగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై టీమ్ 210 పరుగులు చేసినా.. 6 వికెట్ల తేడాతో ఓటమి తప్పలేదు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన సెంచరీ (108 పరుగులు) వృథా అయిపోయింది.
పేలవ బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న లక్నో టీమ్ చెపాక్‌లో చెలరేగిపోయింది. ఆ జట్టు పవర్ హిట్టర్ మార్కస్ స్టాయినిస్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి ఒంటిచేత్తో లక్నోను గెలిపించేశాడు. అతను కేవలం 63 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్సర్లు బాది అజేయంగా 124 పరుగులతో లక్నోని గెలిపించాడు. దాంతో చెన్నైకి టీమ్‌కి సొంత గడ్డపై చేదు అనుభవం తప్పలేదు.
సీజన్‌లో 8వ మ్యాచ్ ఆడిన చెన్నై టీమ్ నాలుగో ఓటమితో ఐదో స్థానానికి పడిపోయింది. మరోవైపు ఐదో విజయంతో లక్నో టీమ్ నాలుగో స్థానానికి ఎగబాకింది.