ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రేపటి నుంచి మూడు రోజులపాటు అంటే సోమవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడతున్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ఆ మేరకు విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజుపాటు వర్షాలు కురిస్తే వాతావరణం చల్లబడి ప్రజలు ఉపశమనం పొందే అవకాశం ఉంది.