Current Date: 04 Oct, 2024

క్రికెటర్ హార్దిక్ పాండ్యాకి హ్యాండిచ్చిన బాలీవుడ్ హీరోయిన్

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యాకి మరో షాక్ తగిలింది. భార్య నటాషాతో విడిపోయిన హార్దిక్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండేతో డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరు కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు. హిందీ పాటలకు ఇద్దరు కలిసి చిందులు వేసిన వీడియోలు సోషల్ మీడియిలో తెగ వైరల్ అయ్యాయి.ఇటు హార్దిక్ భార్యకు విడాకులు ఇవ్వడం, అటు అనన్య పాండే పలువురు హీరోలకు బ్రేకప్ చెప్పి సింగిల్‌గా ఉండటంతో వీరిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనన్య పాండే గతంలో ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్, ఆదిత్యరాయ్ కపూర్‌తో డేటింగ్ చేసింది. రీసెంట్‌గానే ఆదిత్యరాయ్ కపూర్‌కు బ్రేకప్ చెప్పింది ఈ బ్యూటీ. దీంతో అనన్య పాండే, హార్దిక్‌ పాండ్యా రిలేషన్‌‌లో ఉన్నారని అంతా భావించారు.కానీ  హార్దిక్ పాండ్యాకు షాకిస్తూ అనన్య పాండే మరో క్రికెటర్‌తో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. అనన్య పాండే స్టార్ క్రికెటర్‌ శుభమన్ గిల్‌తో ఎఫైర్ ఉందని రూమర్ల చక్కర్లు కొడుతున్నాయి.

Share