Current Date: 04 Oct, 2024

కోర్టులపై నోరుజారిన పవన్ కళ్యాణ్ సామెత చెప్పి మరీ వెటకారం

సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఈ క్రమంలోనే దేశంలో అమలవుతున్న చట్టాలు, కోర్టులపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు నిర్ధాక్షిణ్యంగా పని చేస్తున్నాయని.. అదే సనాతన ధర్మాన్ని దూషించే వారికి మాత్రం కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయిన వాళ్లకు ఆకులు.. కాని వాళ్లకు కంచాలు అన్నట్టు ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆకులు కూడా పోయాయని  చేతుల్లో పెట్టి నాకేసుకోమంటున్నారని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.సనాతన ధర్మం వైరస్ లాంటిదని.. దాన్ని నాశనం చేయాలని పిలుపునిచ్చిన తమిళనాడు మంత్రి, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్.. ఇలాంటి మాటలను ఇస్లాం గురించి అంటే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయని  నిర్ధాక్షిణ్యంగా శిక్షిస్తాయని తెలిపారు. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టినా, శ్రీరాముడిని పాద రక్షలతో కొట్టినా సరస్వతి అమ్మవారిని తిట్టినా ఏం చేసినా ఒక్క కోర్టు మాట్లాడదని.అలాంటి వారిని ఏదైనా అనాలంటే కోర్టులు కూడా భయపడతాయని ఇది న్యాయానికి ఉదాహరణ అని అన్నారు.

Share