వెంకటగిరిలో మహిళలను, వృద్ధులను వేధిస్తున్న ముఠాలపై వచ్చిన ఫిర్యాదులకు స్పందించి తిరుపతి ఎస్పీతో ఫోన్లోమాట్లడినపవన్ కళ్యాణ్ గంటలవ్యవధిలోస్పందించిన పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేసి బైండోవర్ చేసిన పోలీసులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ - తనకార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచివచ్చిన అర్జీలను, ఫిర్యాదులను శనివారం ఉదయం నుంచీపరిశీలించారు . తనకార్యాలయసిబ్బందితో కలసి స్వయంగా ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదివారు.పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం అటవీశాఖలపై వచ్చిన అర్జీలతోపాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ఎదురవుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. తన శాఖల పరిధిలోని ప్రతి అంశాన్నీ అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు, ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియచేసిన సమస్య పవన్ కళ్యాణ్ ను కదిలించింది.