భారత మాజీ క్రికెటర్, ఇటీవల టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత్ జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ తనకి ఇచ్చిన డాక్టరేట్‌ను వెనక్కి తిరిగి ఇచ్చేశాడు. క్రికెట్‌లో ద్రవిడ్ అందించిన సేవలకిగానూ ఐదేళ్ల క్రితం బెంగళూరు యూనివర్సిటీ డాక్టరేట్‌తో సత్కరించింది. కానీ.. ఆ పట్టా తిరిగి ఇవ్వడమే కాకుండా.. ఓ స్ఫూర్తివంతమైన ప్రసంగంతో అందర్నీ మెప్పించాడు.‘‘నా భార్య ఓ డాక్టర్. ఆమె ఆ డిగ్రీని సంపాదించడానికి ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపింది. ఇక మా అమ్మ కూడా ఆర్ట్స్ ప్రొఫెసర్. ఆమె కూడా తన డిగ్రీ కోసం చాలా కాలం కష్టపడింది.
కానీ నేను డిగ్రీల కోసం కష్టపడి చదవలేదు. క్రికెట్ ఆడటానికి మాత్రం కష్టపడ్డాను. కాబట్టి నేను డాక్టరేట్‌కి అర్హుడిని కాదు’’ అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు సైంటిస్ట్‌ల గురించి కూడా ఎవరికీ తెలియని విషయాల్ని ద్రవిడ్ పంచుకున్నాడు.సైంటిస్ట్ ఐన్‌స్టీన్‌కు 1952లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధాన మంత్రి పదవిని ఆఫర్ చేసింది. అప్పుడు ఐన్‌స్టీన్ “ నేను ఫిజిక్స్‌లోనే అనుభవం లేని విద్యార్థిని.. పాలన గురించి ఏం అర్థం చేసుకోగలను’’ అన్నాడట.రష్యన్ ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడుకి 2006లో వచ్చిన నోబెల్ బహుమతి సమానమైన డబ్బుని తిరిగి ఇచ్చేశాడు. “మాది చాలా పేద కుటుంబం. అమ్మ సంపాదనను పొదుపుగా ఖర్చు చేయడానికి రోజూ లెక్కలు వేసేవాళ్లం. నాకు మ్యాథ్స్‌లో నైపుణ్యానికి బీజం పడింది అక్కడే. ఇప్పుడు నా జీవితంలో ఆ పేదరికం లేదు. కాబట్టి ఆ డబ్బుతో నాకు పనిలేదు’’ అన్నాడట.
Share