Current Date: 06 Oct, 2024

ఆర్వో సంతకం బ్యాలెట్ సీరియల్ నంబర్ లేకుంటేవాటిని తిరస్కరించ వచ్చని ఈ సీ స్పష్టం చేసింది.

రిటర్నింగ్ అధికారి  సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. ఈసీమార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు  సీ ఈ ఓ ముకేశ్ కుమార్ మీనా పంపించారు. ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయి. ఫామ్ 13 ఏ పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి.  ఆర్వో సంతకం సహ బ్యాలెట్ ను ధృవీకరించే  రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలి. ఫామ్ 13 ఏ లో ఓటరు, ఆర్వో సంతకం బ్యాలెట్ సీరియల్  నంబర్ లేకుంటేవాటిని తిరస్కరించ  వచ్చని ఈ సీ  స్పష్టం చేసింది.