మాజీ సీఎం వైయస్ జగన్‌కి వరుసగా ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. రాజ్యసభ ఎంపీలు ఒకరి తరువాత ఒకరు రాజీనామా చేస్తుండటం వైసీపీకి రాజకీయంగా ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులు క్రితం బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రూపంలో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయగా, తాజాగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కృష్ణయ్య పదవీ కాలం ఇంకా నాలుగేళ్ల పాటు ఉండగానే, రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో, ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరడం ప్రారంభమైంది. ముఖ్య నాయకులు పార్టీ మారుతున్న జగన్ లైట్ తీసుకుంటున్నారు. 5 రోజుల క్రితం కూడా ఎవరు పార్టీ వదిలిపోయిన పర్వాలేదు, నాయకులు ప్రజల్లో నుండి వస్తారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కృష్ణయ్య బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీ సంక్షేమ సంఘం నేతగా మంచి గుర్తింపు పొందిన కృష్ణయ్య, బీజేపీకి బలమైన మద్దతు అందించగలరు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.