ఏప్రిల్ నెలలోనే తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. తాజాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా మూడు నెలల పాటు తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితిలో.. సూర్యుడు, వేడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
ఎండాకాలంలో.. శరీరంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీంతో.. అనేక సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి మీ ఆహార శైలిని మార్చాలి. ముఖ్యంగా శరీరం హైడ్రేటెడ్‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వేసవిలో లభించే కొన్ని పండ్లు శరీరంలో నీటి కొరత నుంచి కాపాడతాయి. అవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఇంతకీ ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజలు: విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉన్న నారింజలో మంచి నీటి వనరు ఉంటుంది. ఇందులో ఉండే అధిక నీటి కంటెంట్ వేడి వాతావరణంలో మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
పుచ్చకాయ: శరీరంలో నీటిని నింపడానికి.. వేసవిలో మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి పుచ్చకాయ ఒక గొప్ప ఎంపిక. ఇందులో 92 శాతం నీరు ఉంటుంది.
దోసకాయ: దోసకాయలో 96 శాతం నీరు కూడా ఉంటుంది. ఇందులో మిగతా పండ్ల కంటే ఎక్కువ పరిమాణంలో నీరు ఉంటుంది. దోసకాయ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.