హీరో రాజ్ తరుణ్‌కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఒకపక్క వరుసగా సినిమాలు డిజాస్టర్స్ అవుతుండగా.. మరోవైపు మాజీ ప్రేయసి లావణ్యతో చికాకులు తప్పడం లేదు. ఇప్పటికే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల ముంబయిలోని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఇంటి వద్దకు వెళ్లిన లావణ్య హల్చల్ చేసింది. ఆ గొడవ సమయంలో రాజ్ తరుణ్ కూడా ఆ ఇంట్లోనే ఉండటం గమనార్హం.ఆ గొడవ ఘటనపై రాజ్ తరుణ్ పోస్ట్ చేశారు. ముంబయిలో జరిగిన సంఘటనను తలచుకుంటే చాలా బాధగా ఉంది అవమానంగా అనిపించిందని ట్వీట్ చేశారు. ఇలా మీ నివాసం వద్ద గొడవ జరిగినందుకు క్షమించాలంటూ మాల్వీమల్హోత్రాను ట్విటర్ ద్వారా రాజ్‌తరుణ్ కోరారు.రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భలే ఉన్నాడే. ఈ సినిమాలో మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటించారు. జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వస్తోంది.