Current Date: 26 Nov, 2024

సింహాచలంలో వైభవంగా వరాహ స్వామి జమ్మివేట ఉత్సవం

విజయదశమిని పురస్కరించుకుని సింహా చలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి జమ్మివేట ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారి ఉత్సవమూర్తి గోవింద రాజ స్వామిని రాముడిగా అలంకరించి సాయంత్రం సింహగిరి నుంచి మెట్లమార్గం ద్వారా కొండ దిగువకి తీసుకొచ్చారు. కొండ దిగువ తొలిపావంచా వద్ద దేవస్థానం ఈవో వి. త్రినాథరావు, అధికారులు, అడవివరం గ్రామస్తులు స్వామికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి స్వామి వారిని పూలతోటలోకి విహారానికి తీసుకెళ్ళి ప్రధా న మండపంలో అధిష్టింపజేశారు. ఈ సందర్భంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచ నం , షోడషోపచార పూజలు, వేద పారాయణాలు, పంచశూక్త పారాయణాలను నిర్వహించారు. పూలతోటలో శమీవృక్షం చెంత విశేష పూజలు జరిపారు. శమీ దళాలను కోసి స్వామికి సమర్పించి, విశేషంగా అర్చన చేశారు. అనంతరం స్వామి ని అశ్వ వాహనంపై కొలువుదీర్చి , అడవివరం పుర వీధుల్లో తిరువీధి నిర్వహించా రు. అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్ళీ కొండ పైకి స్వామిని తీసుకువెళ్లగా.. మంగళ హారతులతో స్వాగతం పలికారు. 

Share