Current Date: 26 Nov, 2024

గుర్లలో డయేరియా ఏడుకు చేరిన మృతులు

విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. డయేరియాతో బాధపడుతూ పతివాడ సూరమ్మ(65) శుక్రవారం మృతి చెందారు. అతిసారం కారణంగా ఈ నెల 13న ఒకరు, 15న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గురువారం మరో ఇద్దరు మృతి చెందారు. గుర్ల పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో, చీపురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో విజయనగరం సర్వజన ఆసుపత్రి, విశాఖ కేజీహెచ్‌లో పలువురు బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 

Share