Current Date: 26 Nov, 2024

ఏపీకి మరో వర్ష గండం

ఏపీ రాష్ట్రానికి మరో అల్పపీడన గండం రానుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ మధ్య బంగాళాఖాతం, సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో  నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రాబోయే రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

Share