భారత మహిళా క్రికెట్ దిగ్గజం ఝులన్ గోస్వామికి అరుదైన గౌరవం...
Nov 22, 2024
భారత మహిళా క్రికెట్ దిగ్గజం ఝులన్ గోస్వామిని కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో అపూర్వ రీతిలో సన్మానించనున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లోని ఓ స్టాండ్‌కు భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి పేరు పెట్టనున్నారు. ఈ మేరకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. క్రికెట్ ఆటకు ఆమె చేసిన అసమానమైన సేవలకు గుర్తింపుగా బీ బ్లాక్ స్టాండ్‌కి ఆమె పేరు పెట్టాలని సీఏబీ ప్రతిపాదించింది. 2025 జనవరి 22న ఈడెన్‌లో జరిగే ఇండియా, ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్ సందర్భంగా ఈ కార్యక్రమం ఉండనుంది.