Current Date: 06 Jul, 2024

పీలో ఏప్రిల్ పింఛన్ లేట్.. కారణం ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్లు తీసుకునేవారికి బ్యాడ్‌న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పింఛన్లు ఆలస్యంగా పంపిణీ చేయనున్నారు. గత ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన జగన్ ప్రభుత్వం పింఛను అందజేస్తోంది. అయితే ఏప్రిల్‌లో మాత్రం 1న కాకుండా 3న పింఛన్లు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు.

మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుందని.. మార్చి 31న, ఏప్రిల్ 1న బ్యాంకులు పనిచేయని కారణంగా ఏప్రిల్ 1న పంపిణీ చేయాల్సిన పింఛన్లు ఏప్రిల్ 3 నుంచి పంపిణీ చేస్తారని ప్రభుత్వం నుంచి ఆదేశాలు తమకు అందినట్లు అధికారులు చెప్తున్నారు.

ప్రస్తుతం మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉన్నందున పింఛన్ డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు బ్యాంకులు ఇబ్బందులు ఉండే అవకాశం ఉండటంతో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్‌‌లు బ్యాంకు మేనేజర్‌‌లతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు కోరుతున్నారు