Current Date: 05 Oct, 2024

చిరంజీవి డ్యాన్స్‌పై కీర్తి సురేశ్ కామెంట్స్.. రచ్చ షురూ!

మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయిన హీరోయిన్ కీర్తి సురేశ్ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్స్‌తో ఇప్పుడు టాలీవుడ్‌లో ఆమె కెరీర్ ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. కీర్తి నటించిన సినిమా 'రఘుతాత' ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేశ్.. చిరంజీవి కంటే తమిళ హీరో విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పుకొచ్చింది. దాంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కీర్తి కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న మెగా అభిమానులు ఏ కోణంలో విజయ్ మంచి డ్యాన్సరో చెప్పాలని ట్రోల్స్, మీమ్స్ వేస్తున్నారు. కీర్తి సురేష్ గతంలో విజయ్‌తో కలిసి 'భైరవ', 'సర్కార్' అనే సినిమాల్లో నటించింది. అలానే చిరంజీవితోనూ 'భోళాశంకర్'లో చేసింది. కానీ ఈ మూవీ డిజాస్టర్‌ అయ్యింది.

Share