పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందని భారతీయులు గంపెడు ఆశలు పెట్టుకున్న పీవీ సింధు ఆరంభంలోనే ఇంటిబాట పట్టింది. కనీసం క్వార్టర్స్ చేరుకుండానే ఒలింపిక్స్ నుంచి ఇంటిబాట పట్టింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 19-21, 14-21తో చైనా క్రీడాకారిణి హే బిన్ జియావో చేతిలో ఘోరంగా ఓడింది. తొలి సెట్‌లో కాస్త పోరాడిన సింధు రెండో సెట్‌లో మరీ పేలవంగా చేతులెత్తేసింది. దాంతో హ్యాట్రిక్ మెడల్ ఆశ నీరుగారింది. తొలి సెట్ ఆరంభంలో 1-5 తేడాతో వెనకబడ్డ సింధు..మళ్లి ఎంత ప్రయత్నించినా ఆమెకు ఆధిక్యం సాధించే ఛాన్స్ ఇవ్వలేదు. రెండో సెట్‌లోనూ ఆరంభంలోనే 13-5తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లిపోయిన చైనా క్రీడాకారిణి హే బిన్ జియావో సింధుని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టి సునాయాసంగా గెలిచేసింది. టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్‌లో బిన్ జియావోను ఓడించే సింధు కాంస్య పతకం గెలవడం గమనార్హం.