గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. ఇప్పటి వరకు కొడాలి నాని నివాసం దగ్గర ఉన్న భద్రత సిబ్బందితో పాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించింది. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కొడాలి నాని నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.. కోడిగుడ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇలాంటి సమయంలో భద్రతను ఉపసంహరించడంపై చర్చ జరుగుతోంది.గుడివాడ నియోజకవర్గంలో ఇన్నాళ్లు తిరుగులేని నేతగా కొడాలి నాని ఉన్నారు.. 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన నాని జగన్ సర్కార్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.
Share