Current Date: 07 Oct, 2024

అలీ నోట పవన్ మాట.. ఎన్నాకెన్నాళ్లకి!

కమెడియన్ అలీ నోట చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మాట వచ్చింది. వైసీపీ నుంచి ఇటీవల బయటికి వచ్చిన అలీ.. మళ్లీ పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేయడానికి తెగ ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ అలీ తన పాత బంధాన్ని ‘సుమ అడ్డా’ పోగ్రాంలో గుర్తు చేసుకుంటున్నాడు. జులై 23న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.ప్రోమో చివర్లో తన బెస్ట్ కాంబినేషన్ ఎవరితో అని అలీని అడుగుతూ రవితేజ, పవన్ కళ్యాణ్ అంటూ రెండు ఆప్షన్స్ ఇచ్చారు సుమ. దానికి అలీ.. క్షణం కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ అని సమాధానమిచ్చారు. దీంతో నెటిజన్స్.. మొత్తానికి అలీ ఒప్పకున్నాడుగా అని కామెంట్లు చేస్తున్నారు. గతంలో చిరంజీవిని పొగిడిన అలీ.. పవన్ కళ్యాణ్‌ ఎదుగుదలపై వెటకారంగా కామెంట్స్ చేశాడు. వైసీపీలో ఉన్నన్ని రోజులూ పవన్‌‌ని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతకముందు వరకు పవన్ నటించిన దాదాపు ప్రతి సినిమాలోనూ అలీకి క్యారెక్టర్ ఉండేది. అయితే పవన్‌తో విభేదం కారణంగా అతనికి సినిమా అవకాశాలూ ఇండస్ట్రీలో తగ్గిపోయాయి. దాంతో వైసీపీకి రాజీనామా చేసిన అలీ.. మళ్లీ పవన్‌కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు.

Share