Current Date: 26 Nov, 2024

ప్రాణాపాయంలో ఉన్న చిన్నారికి చెర్రీ సాయం

గ్లోబ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి చికిత్స‌కు సాయం చేశారు. పుట్టుక‌తోనే ప‌ల్మ‌న‌రీ హైప‌ర్‌టెన్ష‌న్‌తో బాధ‌ప‌డుతూ ప్రాణాపాయంలో ఉన్న ఓ చిన్నారికి 53 రోజుల పాటు చికిత్స‌కు చెర్రీ సాయం అందించారు. హైద‌రాబాద్‌కు చెందిన ఓ ఫొటో జ‌ర్న‌లిస్టు దంప‌తుల‌కు పుట్టిన చిన్నారికి  గుండెలో స‌మ‌స్య ఉంద‌ని, బ‌త‌కడం క‌ష్ట‌మ‌ని వైద్యులు చెప్పడంతో దంప‌తులు త‌మ పాప‌ను అపోలో ఆసుప‌త్రిలో చేర్పించారు. ఈ స‌మాచారం చ‌ర‌ణ్‌కు తెలియ‌డంతో చిన్నారికి 53 రోజుల పాటు చికిత్స అందించేందుకు సాయం చేశారు. ఇక చికిత్సలో భాగంగా ప్లేట్‌లెట్లు, ర‌క్తం వంటివి చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి అందించారు.  స‌మ‌యానికి వైద్యం అందడం, పాప కోలుకోవ‌డంతో బుధ‌వారం డిశ్చార్జి చేశారు. 

Share