రాష్ట్ర వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1949 నవంబరు 26వ తేదీన కానిస్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను అడాప్ట్ చేసుకుంది. 1950 నవంబరు 26 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అమలులోకి వచ్చి నవంబర్ 26వ తేదికి 75 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఈ రోజు 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సాధారణ పరిపాలనా శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో రాజ్యాంగ పీఠికను చదివించాలని ఆయన సూచించారు.
Share