Current Date: 28 Nov, 2024

ప్రై‘వేటు’కు విశాఖ ఉక్కు

విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను ప్రైవేటు పరం చేస్తే సహించం అని టీడీపీ నాయకులు చెబుతున్నా కేంద్రం మాత్రం ఆ దిశగా చక చకా అడుగులు వేసుకొని పోతోంది. ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావుకు తాజాగా అంటే సెప్టెంబరు 10వ తేదీన రాసిన లేఖ ఈ నిజాన్ని బయట పెడుతోంది. గత అయిదేళ్లగా వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు సంబంధించి ప్రజలను మభ్య పరుస్తూనే వున్నాయని ఈ లేఖ ద్వారా తెటాతెల్లమయింది. 
నాలుగు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసినట్టు, విశాఖ ఉక్కుకు ఎటువంటి ఢోకా లేదని, మరో రెండు వారాల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కీ కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సహకారాన్ని అందిస్తుందని విశాఖ ఎంపీ శ్రీభరత్‌ ప్రకటన ఇచ్చారు. ఇది కచ్చితంగా ప్రజల్ని మోసగించేదిగానే వున్నట్టు మంత్రి పంకజ్‌ చౌదరి రాతపూర్వకంగా పంపిన లేఖను చూస్తుంటే అర్థం అవుతోంది. ఆర్‌ఐఎన్‌ఎల్‌ ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ విషయాలపై 2024 ఆగస్టు 8న స్పెషల్‌ మెన్షన్‌ కింద గొల్ల బాబురావు రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై మంత్రి పంకజ్‌ చౌదరి 2024 సెప్టెంబరు 10న సమాధానమిచ్చారు. 

Share