Current Date: 07 Oct, 2024

యూపీఎస్సీ చైర్మన్‌ రాజీనామా!

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైైర్మన్‌ మనోజ్‌ సోనీ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడిరచాయి. గతేడాది ఏప్రిల్‌ నెలలోనే బాధ్యతలు చేపట్టిన ఆయన ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌  వివాదం వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ వివాదంతో మనోజ్‌ సోనీ  రాజీనామాకు ఎటువంటి సంబంధం లేదని అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. దాదాపు పదిహేను రోజుల క్రితమే ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు పేర్కొన్నాయి. అయితే, దీన్ని ఇంకా ఆమోదించలేదని సదరు వర్గాలు తెలిపాయి. 2017లో యూపీఎస్సీ కమిషన్‌లో సభ్యుడిగా చేరి గతేడాది మే నెలలో చైైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు.

Share